మొదట ఈ ఊరి పేరు ఉరగకొండ (ఉరగాద్రి) . ఉరగము అంటే పాము. ఈ ఊరిలో వున్న కొండ పాము పడగలా వుంటుంది. అందువలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన కరిబసవ స్వామి మఠం మరియు పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉన్నాయి.ఉరవకొండలోని కరిబసవ మఠం రథోత్సవము,ఈ మఠం చాలా పురాతనమైనది.